హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఉప్పల్ భగాయత్‌లో ఐదు ఎకరాల స్థలంతో పాటు, రూ.5 కోట్ల నిధులను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ లాలుకోట వెంకటాచారి బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విశ్వబ్రాహ్మణులకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ, అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
విశ్వబ్రాహ్మణ కులవృత్తిదారులకు ఇప్పటికే ఆధునిక యంత్ర పరికరాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు, సబ్సిడీ రుణాలను అందజేస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ మాదిరిగా విశ్వబ్రాహ్మణులను పట్టించుకోలేదని చెప్పారు. సమావేశంలో ట్రస్ట్ కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్, కోశాధికారి రాగిపని రవీంద్రాచారి, వైస్ చైర్మన్లు వేములవాడ మదన్మోహన్, కుందారం గణేశ్‌చారి, వడ్ల హనుమాండ్లు, సుంకోజు కృష్ణమాచారి, వింజమూరి రాఘవాచారి, ట్రస్టీలు డీ కిషన్‌రావు, వీ వేణుగోపాల్, వీ దానకర్ణాచారి, చిలుకూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.