కరీంనగర్ : కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచి తీరుతారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర షరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లోని జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో తమకు వెయ్యి ఓట్ల వరకు ఉన్నాయని, ఇందులో ఒక్క ఓటు కూడా తగ్గకుండా తమ అభ్యర్థులు ఇద్దరికి వస్తాయని మంత్రి గంగుల ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పట్ల ప్రతి ఒక్కరు అంకితభావంతో ఉన్నారని, ఏ ఒక్క ఓటు కూడా క్రాసయ్యే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.