తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి

- బంజారాహిల్స్ పోలీసులకు టీఆర్ఎస్ సోషల్‌మీడియా ఫిర్యాదు
- రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలోనూ..
నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుమారుడిని ఉద్దేశించి కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై క్రిమనల్ చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్‌మీడియా విభాగం శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్ మీద తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ వేదికగా శుక్రవారం రాత్రి నుంచి తీవ్ర అభ్యంతరకర భాష వాడుతున్నారని, దీనివల్ల లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని టీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ దినేశ్‌తో పాటు పలువురు నాయకులు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకే చింతపండు నవీన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు పలువురు మైనార్టీ నేతలు ఉప్పల్ ఏసీపీ శ్యాంప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ జాగృతి యువజన విభాగం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేరికార్ అరుణ్‌రాజ్ సిర్గాపూర్ పోలీసులకు, ఖమ్మం రెండో పట్టణ పోలీసుఠాణాలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు ఫిర్యాదులు చేశారు.
మోదీ పెండ్లిపై మేము ప్రశ్నించలేదే!
మోదీ జీ.. మీ పెళ్లి విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని మేము ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఎందుకంటే అది మాకు ముఖ్యం కాదు. అలాగే భారత క్రికెట్‌కు జై షా ఏ క్రికెట్ ఆడాడు అని మేము ఎప్పుడూ అడగలేదు. గాంధీజీని, అంబేద్కర్‌ను దూషించేవారికి సంస్కారం అంటే ఏమిటో ఎలా అర్థమవుతుంది.
-క్రిషాంక్, టీఎస్ఎండీసీ చైర్మన్
ప్రజలు అసహ్యించుకుంటున్నారు..
తీన్మార్ మల్లన్న వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి నీచ వ్యక్తులు, కుసంస్కారుల వల్లనే బీజేపీ ప్రతిష్ఠ మరింత మసకబారుతున్నది. చింతపండు నవీన్ చేతలు, రోత మాటలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బీజేపీ అధినేతలు దీనిపై స్పందించాలి. మల్లన్నపై చర్యలు తీసుకోవాలి.
- వాసుదేవరెడ్డి, చైర్మన్, దివ్యాంగ సహకార కార్పొరేషన్
చేతకాని తనానికి నిదర్శనం
తీన్మార్ మల్లన్నా.. నువ్వు మనిషివేనా? ఒకరి పిల్లల శరీరం గురించి మాట్లాడే ముందు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు అనేది గుర్తుంచుకో చింతపండు నవీన్. 75 రోజుల జైలు జీవితం అనుభవించిన నేరస్థుడు.. రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లలను టార్గెట్ చేయడం వాడి చేతకానితనానికి నిదర్శనం.
-ఏనుగు భరత్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

