హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే డాడీ.. అని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రతి రోజు మీ నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటాను. మీరు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు కవిత ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని మృత్యుంజయ హోమం నిర్వహించారు. అనంతరం అమీర్‌పేటలోని గురుద్వారలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Happy birthday daddy.
Everyday, I learn something new from you. Your are an institution in itself.
Wishing for your long, healthy and prosperous life.#MyHero#HappyBirthdayKCR pic.twitter.com/PhwkP2sjcm— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2022