హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్కు టీఆర్ఎస్ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల్లో వారి మద్దతుదారులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.