
నిజామాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలీం కుటుంబ సభ్యులను, నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు కిషన్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అలీం, కిషన్ తండ్రి ఇటీవలే మరణించారు. వీరిద్దరి ఫోటోలకు కవిత పుష్పాంజలి ఘటించారు.
అంతకుముందు డిచ్పల్లి మండలం మెట్రాజ్పల్లిలో 21 వ ప్యాకేజి పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. కాల్వాల ద్వారా పంటపొలాలు నీరు అందే తీరును కవితకు ప్రాజెక్టు అధికారులు వివరించారు.
టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలీం గారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ @RaoKavitha గారు పరామర్శించారు. ఇటీవల మరణించిన అలీం గారి అల్లుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్సీ కవిత భగవంతుని ప్రార్థించారు. pic.twitter.com/VDjIdbWDbu
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) June 9, 2021
నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు కిషన్ గారిని ఎమ్మెల్సీ @RaoKavitha గారు పరామర్శించారు. ఇటీవల మరణించిన కిషన్ గారి తండ్రికి ఎమ్మెల్సీ కవిత గారు నివాళులు అర్పించారు. pic.twitter.com/r7PZGMOtrp
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) June 9, 2021