అగ్నిపథ్ నిరసనలకు మోదీ సర్కారే బాధ్యత వహించాలి : ప్రభుత్వ విప్ బాల్క సుమన్
హైదరాబాద్ : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి బాధ్యత మోదీ సర్కారే వహించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీలో చేరడాన్ని యువత దైవకార్యంగా భావిస్తుంది. కానీ యువతను మోదీ విస్మరించడం బాధ్యతరాహిత్యమని మండిపడ్డారు. ఇప్పటికైనా మోదీ ఈ పథకాన్ని పున:సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని పేర్కొన్నారు. మోదీ అదానీ సేవలో తరిస్తూ.. దేశ ప్రజలను మరిచిపోతున్నారని విమర్శించారు.
మోదీ తుగ్లక్ విధానాలపై దేశం గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ఫాసిస్ట్ విధానాలపై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణలో జరిగిన హింసకు టీఆర్ఎస్ బాధ్యత వహించాలని బండి సంజయ్, కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం దుర్మార్గమని చెప్పారు. మోదీ తూటాలకే తెలంగాణ బిడ్డలు బలయ్యారని బాల్క సుమన్ పేర్కొన్నారు. మోదీ తూటాలకు బలైన రాకేశ్ కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీకి శంకరగిరి మాన్యాలు తప్పవన్నారు. తెలంగాణ బిడ్డల రక్తం కళ్లజూసిన వారెవ్వరూ బాగుపడలేదని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ నుంచి కన్యకుమారి దాకా ప్రజలందరూ బీజేపీపై తిరుగుబాటు చేయాలని కోరారు. ఆర్మీ నియామక ప్రక్రియను తక్షణమే చేపట్టాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

