హైదరాబాద్ : కొత్తూరు, జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం అందించిన ఓటర్లకు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. పార్టీకి విజయం అందించిన ఓటర్లకు ధన్యవాదాలన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ప్రజల అంచనాల మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకుగాను టీఆర్ఎస్ 7 వార్డులను కైవసం చేసుకుని జయకేతనం ఎగురవేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 27 వార్డుల్లో టీఆర్ఎస్ 23 స్థానాలను కైవసం చేసుకుంది.
Thanks to the voters of Kothur for giving TRS Party a landslide victory in the municipal elections. TRS Govt will work to the expectations of the people under the leadership of Hon’ble CM Sri KCR Garu and Hon’ble Minister & TRS Working President Sri @KTRTRS Garu. pic.twitter.com/uD6LTKn87B
— V Srinivas Goud (@VSrinivasGoud) May 3, 2021