యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. గులాబీ పార్టీకి తోడు సీపీఎం, సీపీఐ నేతల క్యాంపెయిన్‌కు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. మంత్రు లు, ఎమ్మెల్యేలు మరింత జోరు పెంచారు. పా ర్టీ శ్రేణులు గ్రామగ్రామాన పర్యటిస్తున్నాయి. మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ మండలంలోని కుంట్లగూడెంలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనానికి ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. చండూరు మండ లంలోని బోడంగిపర్తిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. నారాయణపురం మండలంలోని పొర్లగడ్డ తండా, సీత్యా తండాలో మంత్రి సత్యవతి గడపగడకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మునుగోడు మండలం కొరటికల్‌లో గౌ డ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. నారాయణపురం మండలంలోని డాకుతండా, కేలోతు తండాలో విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మర్రిగూడ మండలంలోని నామాపురం, కొట్టాల, ఇందుర్తి, సరంపేట, లెంకలపల్లి, దామెర భీమనపల్లి, వట్టిపల్లి, రాంరెడ్డిపల్లిలో ప్రచారం నిర్వహిచారు. ఆయా కార్యక్రమాల్లో కూసుకుంట్లతోపాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, సతీశ్ కుమార్, ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.