చౌటుప్పల్, అక్టోబర్ 23: ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని భూ నిర్వాసితులు డిమాండ్ చేశా రు. 3జీ నోటిఫికేషన్లో భాగంగా బుధవారం చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూసేకరణ స మావేశాన్ని మండల పరిధిలోని తాళ్లసింగారం, చిన్నకొండూర్ గ్రామాల రైతులు బహిష్కరించారు. సమావేశానికి వెళ్లకుం డా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగా రు.
ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్కు నాలు గు ప్రధాన రహదారులను 40 కిలోమీటర్ల దూరం కేటాయించి.. చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ ప్రాంతాల్లో కేవలం 28 కిలోమీటర్లు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తహసీల్దార్ హరికృష్ణకు వినతిపత్రం అందజేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.