 
                                                            నవాబుపేట, అక్టోబర్ 23: వికారాబాద్ జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు రోజూ ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. గురువారం నవాబుపేట మండలం పులుసుమామిడిలో కొత్త అలైన్మెంట్లో పోతున్న భూములను దాతాపూర్, చిట్టిగిద్ద, చించల్పేట, వట్టిమీనాపల్లి గ్రామాల రైతులు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త అలైన్మెంట్ను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ మొండి వైఖరితో ఇటీవల బాధిత మహిళారైతు గుండెపోటుతో మరణించిందని, మరికొందరు మానసిక వేదనతో దవాఖానల పాలవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ పనులు చేపట్టాలని, కొందరి లాభం కోసం కొత్త అలైన్మెంట్ పేరిట రూటు మార్చడం సరికాదని పేర్కొన్నారు.
 
                            