హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ ప్రీ బడ్జెట్ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్డీపీఆర్తోపాటు 3డీ డిజైన్లు వం టి పనులు వేగవంతం చేయాలని కోరారు. నిధుల కొరత లేదని, ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని అధికారులకు భరోసా ఇచ్చారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : సచివాలయ భవనం రెయిలింగ్ పట్టీలో కొంతభాగం బుధవారం పడిపోయిన ఘటనపై రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి అధికారులను నివేదిక కోరారు. ఘటన జరిగిన 24 గంటలైనా ఇంకా నివేదిక ఇవ్వకపోవడంపై ఆర్అండ్బీ భవనాల విభాగం ఇంజినీర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరకు భవన నిర్మాణంపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు, సచివాలయాన్ని నిర్మించిన షాపూర్జి పల్లోంజీ కంపెనీ ప్రతినిధులపై ఆర్అండ్బీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.