బాసర, నవంబర్ 5 : ఐక్యరాజ్య సమితి థాయ్‌లాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఆసియా యువత సదస్సులో బాసర విద్యార్థిని సందడి చేశారు. ట్రిపుల్ ఐటీలో ఈసీఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లహరి భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
ఈ సమావేశానికి దాదాపు 36 దేశాల నుంచి 700 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో లహరి.. సంస్కృతి ప్రాముఖ్యత, ప్రపంచ విధానాలను రూపొందించడంలో యువత పాత్ర, సమర్థవంతమైన కమ్యూనికేషన్ ప్రభావంపై ప్రసగించారు. అందరికీ ఉజ్వల భవిష్యత్‌ను అందించే విధానాన్ని వివరించారు.