హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. 13 ఏండ్లుగా ప్రబుద్ధభారత్ ఇంటర్నేషనల్ సంస్థ ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్నది. సెలవురోజు, పండుగరోజు అన్న తేడాలేకుండా నిరంతరాయంగా కార్యక్రమం నిర్వహిస్తున్న ది. శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించా రు. కార్యక్రమంలో పద్మశ్రీ నర్రా రవికుమార్, ప్రబుద్ధభారత్ రాష్ట్ర అధ్యక్షుడు బేగరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.