హైదరాబాద్ : ఖమ్మం(Khammam) జిల్లా చంద్రాయపాలెంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. పోడు భూముల గొడవ పోలీసులపై దాడికి(Tribals attacked) దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే..చంద్రాయపాలెంలో పోడు భూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. కోపోద్రిక్తులైన గిరిజనులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ వివాదంలో సత్తుపల్లి సీఐ కిరణ్, నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.