హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన 27 మంది విద్యార్థులు మాస్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు పొందారు. వారి విజయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఆ విద్యార్థులతోపాటు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను, ఆ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ను, సిబ్బందిని, మాస్ మ్యూచ్‌వల్ ఇన్సూరెన్స్ సంస్థ అధిపతి తంగిరాల రవిని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ అభినందించారు.