శంషాబాద్ రూరల్, నవంబర్ 9: అసైన్డ్భూములను ఆక్రమిస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి వత్తాసు పలికేందుకు వచ్చిన స్థానిక పోలీసులపై గిరిజనులు తిరగబడి నిర్బంధించారు. ఈ ఘటన శంషాబాద్ మండలం మదనపల్లిలో తీవ్ర సంచలనం సృష్టించింది.
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మండ లం మదనపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 50/1 నుంచి 50/5, 50/15లలో దాదాపు 25 ఎకరాల అసైన్డ్‌పట్టా భూమి ఉంది. మూడు తరాల పూర్వం నుంచి ఆ గ్రామానికి చెందిన పలు గిరిజన కుటుంబాలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వారి అవసరాల నిమిత్తం కొంత భూమిని నగరానికి చెంది న ఎక్బాల్సింగ్ అనే వ్యక్తికి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి గిరిజనులకు చెల్లించాల్సిన నగదు పూర్తిగా చెల్లించకపోవడంతో అతను భూమిని తన ఆధీనంలోకి తీసుకోలేదు. విక్రయించిన భూమిలో నుంచి రోడ్డు పోగా మిగిలిన 8 ఎకరాల 20 గుంటల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోహన్‌నాయక్ తనదంటూ తప్పుడు పత్రాలను సృష్టించి, గిరిజనులకు భయాందోళనలకు గురిచేస్తున్నాడు. ఆ భూమి చుట్టూ రేకులతో ప్రహారీ వేసి లోపల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాడు. ఆ భూమి తమ పూర్వీకుల నుంచి తామే సాగుచేసుకుంటున్నామని స్థానిక గిరిజన కుటుంబాలకు చెందిన కే నర్సింగ్, దేవిజ, రాంచందర్‌తో పాటు కొంతమంది కుటుంబసభ్యులు పలుమా ర్లు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో గిరిజన కుటుంబాలు కోర్టును ఆశ్రయించి వివాదస్పద భూమిలోకి పోలీసులు, ఇతరులు వెళ్లడానికి వీల్లేదని స్పష్టమైన ఆర్డర్‌ను తీసుకొచ్చారు.
మోహన్‌నాయక్ చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకునేందుకు గిరిజనులు శనివారం వెళ్లగా, విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎస్సై భాస్క ర్, తన సిబ్బందితో వచ్చి బెదిరించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న గిరిజనులు పోలీసులను నిర్బంధించారు. తాము ఫిర్యాదు చేస్తే సివిల్ తగాదా అంటూ బుకాయించి ఇప్పు డు ఇక్కడకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. అ నంతరం శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్‌రెడ్డి తహసీల్దార్ రవీందర్దత్తో కలిసి అక్కడకు చేరుకుని నిర్బంధంలో ఉన్న ఎస్సై భాస్కర్ ను విడిపించారు. వివాదస్పద భూములపై రెవె న్యూ అధికారుల విచారణ అనంతరం వివరణ ఇస్తామని వెళ్లిపోయారు. తహసీల్దార్ రవీందర్దత్ మాట్లాడుతూ మదనపల్లి సర్వే నంబర్ 50 లో దాదాపు 500లకుపైగా ఎకరాల భూమిని గి రిజనులకు వ్యవసాయం చేసుకోవడానికి ప్రభు త్వం అసైన్డ్ చేసిందని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు.