పరిగి, నవంబర్ 26: లగచర్ల రైతులకు అండగా చలో కొడంగల్, రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి వెళ్తున్న ఎల్‌హెచ్‌పీఎస్, బీఎంపీ, బీఎంఎం గిరిజన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎల్‌హెచ్‌పీఎస్ గౌరవాధ్యక్షుడు, బీఎంపీ జిల్లా అధ్యక్షుడు పాత్లావత్ గట్యానాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్‌నాయక్, సేవాలాల్ సేన జిల్లా నాయకులు కొర్ర బాలకృష్ణ, శీనునాయక్, రవీందర్‌నాయక్, బాబునాయక్, హరిలాల్నాయక్ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
రైతులపై కేసులు ఎత్తివేయాలని, గిరిజన రైతులను బలిచేస్తే ఊరుకునేది లేదని, త్వరలో ప్రగతిభవన్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.