నల్లబెల్లి, ఆగస్టు 31: వరంగల్ జిల్లా నల్లబె ల్లి మండలం రంగాయచెరువు ప్రాజెక్టు నిర్మాణానికి రీడిజైన్ చేయడంతోపాటు నిధులు మం జూరు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇటీవల భూపాలపల్లి జిల్లాలో జరిగిన చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు సమీక్షలో లేవనెత్తడంపై మండలంలోని ఏజెన్సీ గ్రామాల గిరిజన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆసరవెల్లి గ్రామంతోపాటు లక్ష్మీతండా, మేడెపల్లి గ్రామాల రైతులు ఆసరవెల్లిలో శనివారం ఎమ్మెల్యే దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రైతులు మాట్లాడుతూ.. మా ర్పు పేరుతో మాయమాటలు చెప్పి తమ ఓట్లు దండుకొని ఎమ్మెల్యేగా గెలిచాక, తమ గ్రామాలనే ముంచే యత్నం సరికాదని మండిపడ్డారు.