KTR | రాహుల్ ఢిల్లీలో ధర్నా చేస్తే.. నల్లమల పులి కొడంగల్‌లో పడుకుంది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఎద్దేవా
KTR | బీఆర్ఎస్ పార్టీ ప్రధాని మోదీతో మాట్లాడుతుంటే ఈ కేటుగాడు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
KTR | బీఆర్ఎస్ పార్టీ ప్రధాని మోదీతో మాట్లాడుతుంటే ఈ కేటుగాడు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాము ధర్నా కోసం వస్తుంటే కాంగ్రెస్ నేతలు తమ కారుకు అడ్డం పడ్డారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. . ఢిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా చేస్తే.. నల్లమల పులి కొడంగల్‌లో పడుకుందని ఎద్దేవా చేశారు.
ఆడపిల్లల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.ఎలాంటి రాజకీయం చేయకుండా యువతకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతకు భేషరతుగా క్షమాపణ చెప్పి కేసులు కొట్టివేయాలని అన్నారు.
రాజ్యసభలో కొట్లాడేందుకు బీఆర్ఎస్ ఎంపీలు బయల్దేరారని తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలు అడ్డం వచ్చారని పేర్కొన్నారు. మేం ఇక్కడికి వస్తుంటే కాంగ్రెస్ నేతలు మాకు అడ్డం వచ్చారని అన్నారు. మేం మోదీతో కొట్లాడుతుంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నేతలు తమ కారుకు అడ్డం పడ్డారని చెప్పారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా చేస్తే.. నల్లమల పులి కొడంగల్‌లో పడుకుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నీ బిడ్డను ఆ పిల్లలను కొట్టినట్లు కొడితే ఊరుకుంటావా అని ప్రశ్నించారు.
దేశమంతా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుకుంటుందని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్, కేటీఆర్‌ది తప్పు అని అంటున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని నిద్రలో లేపినా కేసీఆర్, కేటీఆర్ అంటున్నాడని అన్నారు. నాపై మాట్లాడిన దానికి నువ్వు రుజువు చేస్తే ఇందిరా పార్క్ దగ్గర నన్ను ఉరితీయ్ అని సవాలు విసిరారు. మోదీని బెదిరించే దమ్ము నీకు లేదు.. మోదీని బెదిరిస్తే నిన్ను జైలులో పెడతారని భయపడుతున్నావని అన్నారు. మోదీని గల్లాపట్టి కొట్లాడే దమ్ము మాకు ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఆందోళనకు రాజకీయ నాయకులను దూరంగా పెట్టండని సూచించారు. రాజకీయ నాయకులు వస్తే మోదీ దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పారు.
రాజకీయ నాయకుడి కొడుకు అత్యాచారం చేస్తే బెయిల్ వచ్చింది.. కానీ సామాన్యుడికి మాత్రం న్యాయం జరగడం లేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా ఏం లాభం లేదని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణం కోసం బయల్దేరిన్నాడు.. అవహేళన చేశారని గుర్తుచేశారు. 14 ఏళ్లు చావుకు, కేసులకు భయపడకుండా పోరాటం చేశారని తెలిపారు. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించారని అన్నారు. కేసీఆరే మనందరికీ స్ఫూర్తి అని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

