భీమ్గల్, జూలై 25: పొలంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి రైతు మరణించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం రహత్నగర్లో చోటుచేసుకున్నది.
రహత్నగర్ గ్రామానికి చెందిన గిరిజన రైతు ధరావత్ రాంసింగ్(45) శుక్రవారం మధ్యాహ్నం తన పొలంలో యంత్రంతో గడ్డి కోస్తుండగా విద్యుత్తు తీగ తగలడంతో కరెంట్ షాక్కు గురై మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.