హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్‌కు స్పీకర్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 19న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, 20న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను ఎదుర్కోనున్నారు. ఈ నెల 19న స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యే వెంకట్రావ్‌పై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేసిన ఫిర్యాదుపై బుధవారం జే రామచంద్రరావు పిటిషనర్ తరపున, ప్రతివాది తరపున టీ శరత్‌లు మౌఖిక వాదనలు వినిపిస్తారు. ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఫిర్యాదుపై మధ్యాహ్నం 12గంటలకు పిటిషనర్ తరపున వాదనలు వినిపిస్తారు. 20న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై చేసిన ఫిర్యాదుపై గురువారం ఉదయం 11గంటలకు పిటిషనర్ తరపున గండ్ర మోహన్‌రావు, ప్రతివాది తరపున ఎన్ నవీన్‌కుమార్‌లు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీపై కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదుపై మధ్యాహ్నం 12గంటలకు పిటిషనర్ తరపున గండ్ర మోహన్‌రావు, ప్రతివాది తరపున శరత్‌లు వాదనలు వినిపించనున్నారు.