పరస్పర బదిలీల్లో సీనియారిటీ నష్టపోకుండా మ్యూచువల్ ట్రాన్సఫర్‌కి అనుమతించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ట్రెసా కృతజ్ఞతలు ప్రకటించింది. సీఎంతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్‌కి కూడా ట్రెసా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. పారా నెం.5 కూడా సవరించి, పరస్పర బదిలీ కోరుకునే ఇద్దరిలో ఇటీవల జోనల్ కేటాయింపుల్లో బదిలీ అయిన వారు ఒకరుండాలనే నిబంధన సవరించి అందరికి అవకాశం కల్పించాలని కూడా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ట్రెసా అధ్యక్షడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల నూతన జోనల్ కేటాయింపుల్లో ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరస్పర బదిలీలకు ప్రభుత్వం జీవో నెం.21 ఇచ్చింది. ఇందులో 7,8 పారాల్లో పరస్పర బదిలీలు కోరుకునే వారు సీనియారిటీ నష్టపోవాల్సి వచ్చింది. ఈ సమస్యను ట్రెసా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సర్కార్ దానిని సవరిస్తూ Gort no.402 ను ఇచ్చింది. దీనిపై ట్రెసా సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు ప్రకటించింది.