హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దనే ఆదేశాలివ్వాలని డీజీపీ జితేందర్ను ట్రెసా కోరి ంది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ శుక్రవారం డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
విధి నిర్వహణలో రెవెన్యూ అధికారులపై ఫిర్యాదులు వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.