హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఐదు జోన్లలో 83 మంది సీనియర్ అసిస్టెంట్లకు నాయ బ్ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించడంపై ట్రెసా హర్షం వ్యక్తం చేసింది. సీఎంకు, రెవెన్యూ శాఖ మంత్రికి, సీసీఎల్ఏకు ధన్యవాదాలు తెలిపింది.
ఆరో జోన్‌లోని మరో 23 మంది సీనియర్ అ సిస్టెంట్లకు డిసెంబర్ 12 తర్వాత ఆమో దం లభించనున్నట్టు సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, కార్యదర్శి కే గౌతమ్ కుమార్ పేర్కొన్నారు. ట్రెసా ముందుచూపు ఫలితంగా పదోన్నతుల ప్రవా హం కొనసాగుతున్నదని తెలిపారు.
గతంలో వంద మంది డిప్యూటీ కలెక్టర్ల ను ఇతర శాఖలలోని ఖాళీలలో సర్దుబాటు చేయడం ద్వారా, దిగువ శ్రేణిలో తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లలో బోనస్‌గా పదోన్నతులు లభిస్తున్నాయని చెప్పారు.