హైదరాబాద్: వృక్షాలు జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యానికి ప్రతీకలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. జీవావరణంలో వృక్షాల ప్రాధాన్యతను చాటి చెప్పేలా యాభై ఏండ్ల క్రితం ‘ట్రీ ఆఫ్ యూనిటీ’ పేరుతో రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్ ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
నేలను చీల్చుకొని వచ్చిన ఓ మొక్క మహావృక్షంగా ఎదిగేందుకు, దాన్ని రక్షించేందుకు పర్యావరణ పరిక్షరక్షకులంతా ఏకమై ముందుకు సాగిన తీరును ఈ వీడియో కళ్లకు కడుతుంది. పక్షులు, మనుషుల ఆకలి తీర్చేందుకు ఫలాలనిస్తూ, సేదతీరేందుకు నీడనిస్తూ తన బాహువులను పరిచిన ఆ మహావృక్షాన్ని నేలమట్టం చేసి లాభపడాలనుకున్న ఓ వ్యక్తికి చివరకు ఎలా జ్ఞానోదయమైందనే సందేశాన్ని ఈ వీడియో అందిస్తుంది. పర్యావరణ పరిక్షణకు చెట్లను సంరక్షించాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెబుతుంది.
Simple yet with a powerful message. Been almost 50 years since this was first exhibited in the country. This particular short animated film is so touching and relates to the present time and can be widely publicised👇.https://t.co/KVYbQPeQsV pic.twitter.com/Od7kOXL9oB
— Santosh Kumar J (@MPsantoshtrs) May 24, 2021