మారేడ్‌పల్లి, జూలై 4: గుండె లయ లోపాలకు చికిత్స అందించడానికి సికింద్రాబాద్‌లోని యశోద దవాఖాన మెడ్‌ట్రానిక్ పల్స్ సెలెక్ట్ సిస్టమ్‌ను ఉపయోగించి అధునాతన పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ (పీఎఫ్ఏ) సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఈ వినూత్నమైన ఉష్ణరహిత ప్రక్రియను ఇద్దరు రోగులపై విజయవంతంగా నిర్వహించినట్టు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విధానం వల్ల రోగులు వేగంగా కోలుకుంటున్నారని తెలిపింది. గుండె లయకు సంబంధించిన రుగ్మతతో బాధపడుతున్న 31, 84 ఏండ్ల వయస్సున్న ఇద్దరు రోగులకు మెడ్‌ట్రానిక్స్ పల్స్ సెలెక్ట్, పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ సిస్టమ్‌తో చికిత్స అందించామని తెలిపింది.
సీనియర్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంఎస్ చంద్రమౌళి మాట్లాడు తూ.. గుండె లయను స్థిరీకరించే చికిత్సలో పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. యశోద దవాఖాన కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ వి భాగంలో ఏట్రియల్ ఫైబ్రిల్లేషన్తోపాటు ఇతర గుండె లయ లోపాలకు సంబంధించిన కాంప్లెక్స్ అబ్లేషన్ విధానాలు, పేస్‌మేకర్ అమరిక, ఐసీడీ, సీఆర్టీ , లీడ్లెస్ పేస్మేకర్లు, కండక్షన్ సిస్టమ్ పేసింగ్, హార్ట్ ఫెయిల్యూర్‌కు సంబంధించిన ఆధునిక చికిత్సలు నిపుణుల పర్యవేక్షణలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.