హైదరాబాద్, జూలై 1 (నమస్తే తె లంగాణ) : రాష్ట్రంలోని వాహన షో రూమ్‌ల్లో తనిఖీలు నిర్వహించి, ని బంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల రవాణాశాఖ అధికారులకు రవాణా కమిషనర్ ఇలంబరిది ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రత్యేకంగా సర్క్యులర్ విడుదల చేశారు.
మోటర్ వాహనాల చట్టం ప్రకారం తప్పనిసరి అయిన వ్యాలిడ్ టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు(టీఆర్) జారీ చేయకుండా కొందరు డీలర్లు, షోరూమ్ వాహనాలను కొనుగోలుదారులకు డెలివరీ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే డెలివరీ సమయంలో కొనుగోలుదారుల నుంచి అనధికారికంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేపడుతున్నట్టు ఇలంబరిది పేర్కొన్నారు. 15 రోజుల్లోగా తనిఖీ లు పూర్తి చేయాలని ఆదేశించారు.