హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : టీచర్ల బదిలీల్లో పారదర్శకత పాటించాలని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో టీహెచ్ఎంఏ, టీటీయూ, టీయూటీఎఫ్, ఆర్యూపీపీఎస్ సంఘాల ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బదిలీల్లో ఒకేచోట ఎక్కువ ఏండ్లు పనిచేసే వాళ్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే నిబంధన అన్ని క్యాటగిరీలకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. 317 జీవోలో భాగంగా బదిలీ అయిన వారికి పాత సీనియారిటీ ఇవ్వాలని కోరారు. బదిలీలకు ముందు 13 జిల్లాల స్పౌజ్, పరస్పర బదిలీలు పూర్తి చేయాలని తెలిపారు.