హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్జెండర్స్ అండ్ హిజ్రాల రాష్ట్రస్థాయి సదస్సును మంగళవారం హైదరాబాద్లో నిర్వహించనున్నామని హిజ్రా అండ్ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మోనాలిసా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సదస్సులో ట్రాన్స్జెండర్లు, హిజ్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నామని వెల్లడించారు. ప్రభుత్వాలు హక్కుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సదస్సులో చర్చించనున్నామని పేర్కొన్నారు. సదస్సును ట్రాన్స్జెండర్లు విజయవంతం చేయాలని ఆమె కోరారు.