పెద్దపల్లి, ఆగస్టు 11: టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ట్రాన్స్పార్మర్ రిపేరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. దీంతో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, కాల్వ శ్రీరాంపూర్, గోదావరిఖని, మంథనిలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాలు మూతపడ్డాయి. ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కోసం 2014లో రెండేండ్ల కోసం ఇచ్చిన ధరలను ఇప్పటి వరకు కొనసాగించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, ఈ కారణంగానే స్టేట్ ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆదివారం నుంచి సమ్మెలోకి వెళ్లినట్టు ఆ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి అలుగుబెల్లి కృష్ణారెడ్డి తెలిపారు.
పదేండ్లుగా ఎన్పీడీసీఎల్ సంస్థ పరిధిలో ప్రైవేట్ ట్రాన్స్ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసి రైతులకు సకాలంలో అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు రూ.16 వేల నుంచి రూ.25 వేల దాకా ఎన్పీడీసీఎల్ సంస్థ ఇస్తుందని చెప్పారు. కరోనా తర్వాత ముడి సరుకులు, రాగి, అల్యూమినియం వైర్, కూలీల ధరలు రెండింతలు పెరిగాయని తెలిపారు. దీంతో మరమ్మతుల ధరలు పెంచాలని ఎన్పీడీసీఎల్కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వర్షాలు సరిగా పడక, కాలువల నీరు రాకరైతులు తమ పంటలను కాపాడుకొనేందుకు ఎక్కువగా మోటర్లు వినియోగిస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలే ప్రమాదం ఉన్న ది. మరమ్మతు చేసిన ట్రాన్స్ఫార్మర్లు సకాలం లో అందకుంటే పంటలు ఎండుతాయని రై తులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రా క్టర్లతో వరంగల్లో మంగళవారం చర్చలు జరపనున్నట్టు పెద్దపల్లి సర్కిల్ ఎస్ఈ గంగాధర్ తెలిపారు.