హైదరాబాద్ : రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్( IPS )లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . సీనియర్ ఐపీఎస్‌లు శిఖాగోయల్ ( Shikha Goel ) , దేవేంద్ర సింగ్ చౌహన్, షాహనాజ్ ఖాసిం, డాక్టర్ తరుణ్ జోషి, అవినాష్ మోహంతి, బి.సుమతి ( Sumathi ) , కార్తికేయను ప్రభుత్వం బదిలీ చేసింది. విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్లో డీజీగా ఉన్న శిఖా గోయల్‌ను పోలీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ సైబర్ సెక్యురిటీ బ్యూరోకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.
అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్న దేవేంద్ర సింగ్ చౌహన్‌ను విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్లో డీజీగా బదిలీ చేసింది. డ్రగ్స్ కంట్రోల్ డీజీగా పనిచేస్తున్న షాహనాజ్ ఖాసీంను మల్టీజోన్ -2 ఐజీపీగా నియమించింది, ఏసీబీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్‌గా , ఎస్ఐబీ ఐజీపీ గా పనిచేస్తున్న సుమతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్‌లో ఐజీ గా పనిచేస్తున్న కార్తికేయను అదే విభాగంలో పూర్తిస్థా ఐజీపీగా నియమించింది.