హైదరాబాద్ : రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగుల మల్టిజోన్-2 పరిధిలో పనిచేస్తున్న 14 మంది పోలీసు అధికారులను బదిలీ ( Transfers ) చేస్తూ అడిషనల్ డీజీపీ( Additional DGP ) ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ పరిధిలోని మహబూబ్‌నగర్ జిల్లాలో సీసీఎస్‌లో పనిచేస్తున్న కె. సుగంధ రత్నంను వనపర్తి జిల్లాకు బదిలీ చేశారు.
వనపర్తి సర్కిల్లో పనిచేస్తున్న ఎం. కృష్ణయ్యను, మహబూబ్‌నగర్ డీసీఆర్బీలో పనిచేస్తున్న ఎండీ మగ్దూం అలీని, వికారాబాద్ టౌన్ పీఎస్‌లో పనిచేస్తున్న బి. భీంకుమార్‌ను, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో సర్కిల్లో పనిచేస్తున్న డి.విష్ణువర్దన్ రెడ్డిని, నల్గొండ జిల్లా నకిరేకల్ పీఎస్‌లో ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న జి.రవిబాబును మల్టిజోన్-2లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
నల్గొండలో వేయిటింగ్‌లో ఉన్న సీహెచ్ మోతీరాంను మహబూబ్‌నగర్ సీసీఎస్‌కు, ఎం.నర్సింహులును మహబూబ్‌నగర్ డీసీఆర్బీకి బదిలీ చేశారు. హైదరాబాద్‌లో వేయిటింగ్‌లో ఉన్న కె.రఘుకుమార్‌ను వికారాబాద్ టౌన్ పీఎస్, నారాయణపేట జిల్లా మరికల్ సర్కిల్లో పనిచేస్తున్న కె.రాజేందర్ రెడ్డిని మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పీఎస్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా ట్రాఫిక్ పీఎస్‌లో ఉన్న ఎం. భగవంత రెడ్డిని నారాయణపేట జిల్లా మరికల్ సర్కిల్‌కు, నల్గొండ డీసీఆర్బీలో పనిచేస్తున్న ఈ. రఘువీరా రెడ్డిని నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండకు బదిలీ చేశారు. హైదరాబాద్ సిటీలో వేయిటింగ్‌లో ఉన్న వి. ప్రదీప్ కుమార్‌ను గద్వాల జిల్లా ఆలంపూర్ సర్కిల్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.