30 మంది ఐఏఎస్‌ల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు కీలకశాఖలకు సంబంధించిన కార్యదర్శులను మార్చి, వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాకార్యదర్శి రామకృష్ణారావు శనివారం సాయంత్రం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
- బదిలీ చేసినా పలువురికి అదనపు బాధ్యతలు
- కుదురుకోకముందే కొందరికి మళ్లీ తబాద్లా..
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు కీలకశాఖలకు సంబంధించిన కార్యదర్శులను మార్చి, వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాకార్యదర్శి రామకృష్ణారావు శనివారం సాయంత్రం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన పలువురికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను కొనసాగించింది. ఇక ఇటీవల బాధ్యతలను స్వీకరించి, శాఖలో పూర్తిగా కుదురుకోకముందే పలువురిని మళ్లీ బదిలీ చేయడం గమనార్హం.
బదిలీతోపాటు అదనపు బాధ్యతలు..
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేకకార్యదర్శిగా దానకిషోర్‌ను నియమించింది. గవర్నర్ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగనున్నారు. ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా విజయేంద్రబోయిని నియమించారు. ఆయన అదే శాఖ కమిషనర్‌గా, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిగానూ కొనసాగనున్నారు. కార్మికశాఖ కార్యదర్శిగా దాసరి హరిచందనను ప్రభుత్వం నియమించింది. ఆయనకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవోగా హనుమంతును నియమించడంతోపాటు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలను అప్పగించింది. గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సంతోష్ బీఎంను నియమించిన ప్రభుత్వం ఆయనకు శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. అనుదీప్ దురిశెట్టిని ఐటీశాఖ జాయింట్ సెక్రటరీగా నియమించడంతోపాటు, గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్, టీజీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గానూ అదనపు బాధ్యతలను అప్పగించింది.
సెలవులో ఉన్నా.. కుదురుకోకముందే బదిలీలు
ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న కృష్ణ ఆదిత్యను బదిలీ చేసి పరిశ్రమల, వాణిజ్యశాఖ ప్రత్యేకకార్యదర్శిగా సర్కారు నియమించింది. కాగా ఆయన ప్రస్తుతం 45 రోజుల సెలవుపై ఇటీవలనే వెళ్లారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆ శాఖకు సంబంధించిన వర్కింగ్ అరేంజ్మెంట్ చేయకుండానే ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే కృష్ణ ఆదిత్య సెలవుపై వెళ్తున్న క్రమంలో ఇటీవలనే దేవసేనకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రెండురోజులు తిరగకముందే మళ్లీ బోర్డు కార్యదర్శిగా ప్రస్తుతం అభిలాష అభినవ్‌ను నియమించింది. నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా మూడు నెలల క్రితమే బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్‌జైన్‌ను తాజా సంగారెడ్డికి బదిలీ చేసింది.
అధికారుల బదిలీల వివరాలు..

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

