విద్యుత్తు సమ్మె భావ్యం కాదు
ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జాక్) తలపెట్టిన సమ్మె విషయంలో తెలంగాణ లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని, సయోధ్య కుదుర్చాలని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కోరారు.
- చర్చలకు సిద్ధం.. జోక్యం చేసుకోండి
- లేబర్ కమిషనర్‌కు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జాక్) తలపెట్టిన సమ్మె విషయంలో తెలంగాణ లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని, సయోధ్య కుదుర్చాలని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కోరారు. ఈ మేరకు ఆయన గురువారం లేబర్ కమిషనర్‌కు లేఖ రాశారు. టీఎస్పీఈ జాక్‌తో ఇప్పటికే ఐదుసార్లు చర్చలు జరిపామని, విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని 6% ఫిట్‌మెంట్‌కు ప్రతిపాదించామని వివరించారు.
ప్రస్తు తం యాసంగి పంటలు కీలక దశలో ఉన్నాయని, టెన్త్ పరీక్షలు కొనసాగుతున్నాయని, ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆయా వర్గాలకు ఇబ్బంది కలగకుండా సమ్మె నోటీసును ఉపసంహరించుకోవాలని కోరామని తెలిపారు. ఇదిలా వుండగా, పీఆర్సీ ఫిట్మెంట్, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈ నెల 25న ఉదయం 8నుంచి తాము సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ విద్యుత్తు ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

