కామారెడ్డి : వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.12,500 రూపాయల లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఏఈ(Transco AE) ఏసీబీ(ACB)కి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే..కామారెడ్డి(Kamareddy) 33 /11 కేవీ సబ్ స్టేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రాజు వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్ డ్రైవర్ భైరవ స్వామి వద్ద నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కామారెడ్డి సబ్‌స్టేషన్‌లో రూ.12,500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.