నల్లగొండ : తెలంగాణ వ్యాప్తంగా రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి గురువారం నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్(TS Edcet) ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగింది . నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సమావేశమైన అధికారులు సెట్ నిర్వహణను పరిశీలించారు. అనంతరం నల్గొండ లోని ఎస్పీఆర్ పాఠశాల ఆవరణలోని డీపీఎంఎస్ ఆన్లైన్ పరీక్ష కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ ,టీఎస్ ఎడ్సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్ రెడ్డి , రిజిస్టర్ ప్రొఫెసర్ టి కృష్ణారావు తనిఖీ చేశారు.
వారి వెంట టీఎస్ ఎడ్సెట్ ప్రత్యేక పరిశీలకులు బొడ్డుపల్లి రామకృష్ణ, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ వి రాఘవేంద్ర, టీఎస్ ఎడ్సెట్ అధికారులు ఉన్నారు. తొలిసెషన్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించగా.. 10,725 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 8, 981 మంది హాజరయ్యారు.