హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కొత్తగా అభివృద్ధి చెందుతున్న జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(జెన్ ఏఐ)పై దేశవ్యాప్తంగా కోటి మంది మహిళలకు శిక్షణనివ్వడమే లక్ష్యంగా ‘సౌత్ ఏషియన్ ఉమెన్ ఇన్ టెక్’ సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది.
స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్(హైసియా)తో కలిసి జెన్ ఏఐపై మహిళలకు వృత్తిపరమైన నైపుణ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. టీ హబ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
శిక్షణ ద్వారా దేశ సాంకేతిక, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు అవసరమైన నైపుణ్యం మహిళలకు వస్తుందని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. దేశంలోని డిజిటల్ టాలెంట్‌లో 13-14 శాతంతో హైదరాబాద్ 4వ స్థానంలో ఉందని చెప్పారు.