హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): పర్యావరణ మార్పులపై జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో గురు, శుక్రవారాల్లో రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, వ్యూస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌నకు తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం సహకారం అందించనున్నది.బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో ఈ శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పాల్గొననున్నారు. ఈ శిబిరంలో తెలంగాణతోపాటు ఒడిశా, ఏపీకి చెందిన జర్నలిస్టులు పాల్గొంటారని, వారికి సీనియర్ పాత్రికేయులు, నిపుణులు శిక్షణ ఇస్తారని వ్యూస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భీమారావు తెలిపారు.