హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకు ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూకు సంబంధించి ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
శిక్షణకు కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల మించని అభ్యర్థులు అర్హులని స్పష్టం చేశారు.