Home
Telangana
Tragedy Strikes Family As Man Dies Of Heart Attack Soon After Mothers Demise In Medak
Medak | తల్లికి గుండెపోటు వచ్చిన 24 గంటల్లోనే కుమారుడికి.. ఇద్దరూ మృతి
Medak | ఇది హృదయవిదారక ఘటన. తల్లి గుండెపోటుతో చనిపోయింది. తల్లి మరణాన్ని తట్టుకోలేని కుమారుడికి.. ఆమె అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు.
Medak | మెదక్ : ఇది హృదయవిదారక ఘటన. తల్లి గుండెపోటుతో చనిపోయింది. తల్లి మరణాన్ని తట్టుకోలేని కుమారుడికి.. ఆమె అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కౌడిపల్లి కి చెందిన దొంత లలిత(70) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. అదే రోజు సాయంత్రం లలిత అంత్యక్రియలు నిర్వహించారు. లలిత మృతితో ఆమె కుమారుడు నరేందర్(45) తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. నరేందర్‌కు కూడా సోమవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. తల్లీకుమారుడు 24 గంటల వ్యవధిలోనే చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నరేందర్ భార్యా, పిల్లల రోదన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

