నాగిరెడ్డిపేట, అక్టోబర్ 8: అప్పులు బాధ తో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకు చెందిన నాయికోటి కిష్టయ్య (55) రైతు. పొలం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కోళ్లఫారాన్ని ఆర్నెళ్ల క్రితం లీజుకు తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు పెరుగడంతో మానసికంగా కుంగిపోయాడు.
సోమవారం రాత్రి కోళ్ల ఫారంలో నిద్రించడానికి వెళ్లిన కిష్టయ్య మంగళవారం ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి వెతకగా పెద్ద ఆత్మకూర్ శివారులో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.