హైదరాబాద్: హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఇవి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. 67 చోట్ల దారి మళ్లింపులు ఉంటాయన్నారు. ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో బుధవారం రాత్రి 10 వరకు ఇతర వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని కోరారు.