హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఇటీవల కరోనా బారినపడి కోలుకొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఒగ్గు కళాకారులు ఆశీర్వదించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో కలిసి.. ఎల్లమ్మ, మల్లన్నల పసుపు, కుంకుమ, ప్రసాదాలను మంత్రికి అందచేశారు. తమ సంప్రదాయ పద్ధతిలో ఢమరుకం మోగిస్తూ మంత్రిని ఆశీర్వదించారు. మంత్రిని కలిసిన వారిలో ఒగ్గు రవి నేతృత్వంలోని బృందం సభ్యులు ఉన్నారు. అనంతరం గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు మర్యాదపూర్వంగా కలువగా మంత్రి అతన్ని అభినందించారు.
ప్రభుత్వం రైస్ మిల్లర్ల నుంచి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో బియ్యం తీసుకోవాలని వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యులు ప్రభుత్వాన్ని కోరా రు. శుక్రవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. తమకు విధించిన లక్ష్యానికి మరికొంచెం బాయిల్డ్ రైస్ ఇవ్వాల్సి ఉన్నదని, త్వరలోనే ఇస్తామని వారు తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో తోట సంపత్ కుమార్, గోనెల రవీందర్, తక్కెళ్లపల్లి యుగేంధర్ ఉన్నారు.