బంజారాహిల్స్,జూలై 16: విద్యుత్తుశాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను పర్మినెంట్ చేసే అంశంపై అసెంబ్లీలో మాట్లాడాలని ఆర్టిజన్లు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. బుధవారం బంజారాహిల్స్‌లో తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కేటీఆర్‌ను కలిసి, తమ సమస్యలపై అసెంబ్లీతోపాటు ప్రజావేదికలపై మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
యూనియన్ నేతలు మాట్లాడుతూ అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్లకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ప్రమోషన్ ఇవ్వాలనే నిబంధనతో వందలాది మంది ఉద్యోగులు 20ఏండ్లుగా ఒకే పొజిషన్లో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులను రెగ్యులర్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌ను కోరారు.