Boyalapally Rekha : దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు చట్టబద్ధంగా లభిస్తున్న పని హక్కును నరేంద్ర మోదీ ప్రభుత్వం హరించే ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి (Boyalapally Rekha) మండిపడ్డారు. జాతిపిత మహాత్మ గాంధీ పేరుతో కొనసాగుతున్న పథకం పేరును ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్'( (Gramin) Bill)గా మార్చి కొత్త బిల్లు తీసుకురావడాన్ని రేఖ ఖండించారు. సంస్కరణల పేరుతో పేదల పొట్ట కొట్టొద్దని ఆమె బీజేపీని హెచ్చరించారు.
ఎంజీనరేగా అనేది ఒక పథకం కాదు.. పేదలకు పని కల్పించే చట్టబద్ధమైన హక్కు. కానీ ఎన్డీఏ సర్కార్ కొత్త బిల్లు గ్రామీణ ప్రజానీకంపై ప్రభావం చూపనుంది. డిమాండ్ ఆధారిత ఉపాధిని రద్దు చేసి, బడ్జెట్ పరిమితుల పేరుతో పేదల పనిహక్కుపై కత్తి పెడుతున్నారు అని మోడీ సర్కార్ను విమర్శించారు మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు.
‘మోడీ ప్రభుత్వం తలపెట్టిన ఈ బిల్లుతో కేంద్రం ఈ పథకం బాధ్యతల నుంచి వైదొలుగుతుంది. ఫలితంగా రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ నిరుద్యోగం పెరుగుతుంది. జాతీయ ఉపాథి హామీ పథకం ద్వారా ఏళ్లుగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన జీవన భద్రత దెబ్బతింటుంది. నిజం చెప్పాలంటే.. రోజ్గార్ అజీవక మిషన్ అనేది సంస్కరణ కాదు. పేదవారి హక్కుల హననం. ఇది అభివృద్ధి కాదు. పథకం పేరు మార్చితే ఉపాధి రాదు. నినాదాలు ఇచ్చినంత మాత్రాన పేదల ఆకలి తీరదు. “వికసిత్ భారత్” పేరుతో గ్రామీణ భారతాన్ని బలి చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వెలిబుచ్చుతూనే ఉంది. కాబట్టి.. MNREGAని యథాతథంగా కొనసాగించాలి. పనిదినాలతో పాటు వేతనం కూడా పెంచాలి. పేదల పనిహక్కుల పరిరక్షణలో రాజీ పడేదే లేదు. కోట్లాది మంది గ్రామీణ పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని