హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీల్లో పెండిం గ్ బిల్లులను వారం రోజుల్లో (బతుకమ్మ పండుగలోపే) క్లియర్ చేయాలని తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంచాయతీ కార్యదర్శుల ఎఫెక్టివ్ డేట్‌ను అన్ని జిల్లాల్లో వెంటనే ఇస్తూ ప్రొబేషన్ డిక్లే ర్ చేయాలని కోరారు. సచివాలయంలో మంగళవారం మంత్రి సీతకకు ఆ ఫెడరేష న్ నాయకులు వినతిపత్రం అందజేశారు. వీటిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పం దించారు. ఫైల్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీపీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, గౌరవాధ్యక్షుడు సందీ ప్, కోశాధికారి ముత్యాల శశిధర్‌గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గౌతం పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినపత్రం ఇచ్చి మాజీ సర్పంచ్‌లు నిరసన తెలిపారు. తమకు రావాల్సిన పెండింగ్ బి ల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా ప్ర భుత్వం పట్టించుకోవడంలేదని వాపోయా రు. సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటు న్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, నాయకులు మెడబోయిన గణేశ్, అరవింద్‌రెడ్డి, మాదాసు రవి, పూర్ణచందర్‌గౌడ్, సముద్రాల రమేశ్, పీ పాండు, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.