హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : దమ్ముంటే బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని ఒప్పించాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌కు పీసీసీచీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. బండిసంజయ్ దిగజారి వ్యాఖ్యలు చేయడం మంచిపద్ధతి కాదని మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారని విమర్శించారు. సొంత పార్టీ నేతలే సంజ య్ వైఖరిపై గుర్రుగా ఉన్నారని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయవద్దని.. బాధ్యత గల కేంద్రమంత్రిగా వ్యవహరించాలని హితవు పలికారు. బండి సంజయ్ ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రబ్బరు స్టాంప్ సీఎంలా మారారని వ్యాఖ్యానించారు. క్యాబినెట్ విస్తరణ ఏఐసీసీ చేతిలో ఉండటమేంటని, సచివాలయం నుంచి ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రివ్యూ చేయడమేంటని ప్రశ్నించారు.