హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): లగచర్లలో కలెక్టర్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. అధికారులపై దాడి హేయమైన చర్య అని, ఈ దాడిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. ఆయనకు శిక్ష తప్పదని పేర్కొన్నారు.
ఈ ఘటనలో భాగమైన ఎవర్నీ వదలొద్దని, ఈ ఘటనపై నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అడ్డుకునేవారంతా నేరస్థులేనని పేర్కొన్నారు. ఈ ఫార్ములా రేస్ విషయంలో లావాదేవీలు జరిగినట్టు పక్కా ఆధారాలున్నట్టు తెలిపారు.