హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో పట్టాదారులు.. కౌలుదారులు అంటూ ప్రత్యేకంగా ఉండరని.. మంత్రుల నుంచి కార్యకర్తల దాకా అంతా ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంగళవారం గాంధీభవన్‌లో ఆయన స్పందించారు.
జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్ నేత అని.. ఆయన చెప్తున్న అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. జీవన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై అధ్యయనం చేస్తామని, ఆయనకు ఏమైనా సమస్యలుంటే అకడి మంత్రి లక్ష్మణ్ పరిషరిస్తారని చెప్పారు. పార్టీలో ఉన్న సమస్యలను క్రమశిక్షణ కమిటీ పరిషరిస్తుందని, పార్టీలో సమస్యలను పెద్ద మనసుతో పరిషారం చేసుకుంటామని పేర్కొన్నారు.